: వేలంలో నరేంద్ర మోదీ రూ.10 లక్షల సూట్... సూరత్ లో నేడు వేలం ప్రారంభం


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్ ప్రస్తుతం వేలానికి వస్తోంది. దాదాపు రూ.10 లక్షల ఖరీదైన సదరు బంద్ గలా సూటుపై ‘నరేంద్ర దామోదర్ దాస్ మోడీ’ అనే అక్షరాలను నిలువు గీతల్లా రాయించుకున్న మోదీ, విపక్షాల విమర్శలకు గురయ్యారు. తాజాగా ఆ సూట్ ను నేటి నుంచి మూడు రోజుల పాటు సూరత్ లో జరగనున్న వేలంలో పెట్టనున్నట్లు నగర కమిషనర్ చెప్పారు. ప్రధానిగా తొమ్మిది నెలల కాలంలో తనకు వచ్చిన బహుమతులను ఈ వేలంలో అమ్మేసేందుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కు నిధుల కోసమే ఈ వేలం నిర్వహిస్తున్నారు. ప్రధానికి వచ్చిన బహుమతులను జాతీయ సంపదగా గుర్తించి, వాటిని వేలంలో పెడుతున్నామని కమిషనర్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే మోదీ, ఈ తరహా వేలానికి తెర తీశారు.

  • Loading...

More Telugu News