: బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ ఊహాగానమే... కేంద్ర ప్రభుత్వంలో చేరబోం: ఎంపీ కవిత
భారతీయ జనతా పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి దోస్తీ మాటే లేదని కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కవిత అన్నారు. రెండు పార్టీల మధ్య దోస్తీ, కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందన్న ప్రచారం కేవలం ఊహాగానాలేనని ఆమె కొట్టిపారేశారు. నిన్న ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆమె ప్రకటించారు. హోదాలపై తమ కుటుంబంలో ఏ ఒక్కరికీ ఆశ లేదని కవిత తేల్చిచెప్పారు. తెలంగాణ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మాత్రమే తమకు ముఖ్యమన్నారు.