: శ్రీశైలంలో ఉద్రిక్తత... భక్తులపై ఆలయ సిబ్బంది దాడి: ఆందోళనకు దిగిన భక్తులు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ వైపు శివనామస్మరణ హోరెత్తుతుండగా, శ్రీశైల ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ సిబ్బంది రెచ్చిపోయారు. భక్తులపై దాడికి దిగారు. దీంతో కంగుతిన్న భక్తులు ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసమొచ్చిన తమపై దాడి చేసిన సిబ్బంది బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆలయ పరిసరాల్లోని రాజగోపురం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.