: భోళాశంకరుడిని అనుకుంటున్నారేమో... రౌద్రశంకరుడిని కూడా!: తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం


తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ బర్తరఫ్ కు గురైన తాటికొండ రాజయ్య మహాశివరాత్రి సందర్భంగా రౌద్రావతారం ఎత్తారు. తన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ లో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పదవి కోల్పోయిన నాటి నుంచి అభద్రతాభావంలోకి వెళ్లిపోయిన ఆయన ఇదివరకే ఈ తరహా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదివరకటి వ్యాఖ్యలకు కాస్త మసాలా జోడించి రౌద్రావతారం ఎత్తారు. ‘‘నన్ను అందరూ భోళా శంకరుడినని అనుకుంటారు. నా నియోజకవర్గంలో వేలు పెడితే రౌద్రశంకరుడిగానూ మారాల్సి వస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News