: శివరాత్రి పర్వదినాన తమిళ సీఎం పీఠంపై పన్నీర్ సెల్వం!


అదేంటీ, తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ఎప్పుడో పదవీ బాధ్యతలు చేపట్టారుగా, మళ్లీ సీఎం పీఠంపై సెల్వమేంటనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమార్జన కేసులో దోషిగా తేలిన తర్వాత పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అయితే ‘అమ్మ’పై ఉన్న భక్తిశ్రద్ధల నేపథ్యంలో ఆయన సీఎం కుర్చీపై కూర్చోలేదు. సరే, సీఎం కార్యాలయంలో ఆయన చేస్తున్న ‘అమ్మ’ పూజ ఎవరికీ కనబడదు కాని, ఏకంగా అసెంబ్లీలోనూ ఆయన ‘అమ్మ’ భక్తి చాటుకున్నారు. జయలలిత కూర్చున్న సీట్లో కూర్చోలేకపోయారు. సభలో సీఎం కూర్చునే సీటును ఖాళీగానే పెట్టేసిన సెల్వం, మరో స్థానంలో కూర్చుని విమర్శలు కొని తెచ్చుకున్నారు. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన ఆయన సీఎం ఆఫీస్ లో జయలలిత కూర్చున్న సీటుపై ఆసీనులయ్యారట.

  • Loading...

More Telugu News