: 'ధోనీ అండ్ కో'తో జర జాగ్రత్త... పాక్ పై గెలుపుతో టీమిండియా సత్తాపై మాట మార్చిన సచిన్!


వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయం సాధించడంతో టీమిండియా సత్తాపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాట మర్చాడు. 'ధోనీ అండ్ కో'తో జాగ్రత్త అంటూ అతడు అగ్రశ్రేణి జట్లను హెచ్చరించాడు. వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్లే అవకాశాలున్నాయంటూ సచిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ పోరులో టీమిండియాకూ అవకాశాలు లేకపోలేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో టీమిండియా ఏమాత్రం తీసిపోదని తేల్చేశాడు. చిన్న చిన్న పొరపాట్లకు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని, ఒక్క మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన రోహిత్ తో పాటు ఏ ఒక్కరిని నిరుత్సాహపరచొద్దని సూచించాడు. 'ఇప్పటి ఫామ్ నే కొనసాగించండి, టైటిల్ మనదే'నంటూ టీమిండియాకు ధైర్యం చెప్పాడు.

  • Loading...

More Telugu News