: 90 శాతం మంది మగాళ్లు ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నారు: బీహార్ సీఎం మాంఝీ వ్యాఖ్య


వివాదాస్పద ప్రకటనలకు కేంద్ర బిందువుగా మారిన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరో సంచలన వ్యాఖ్య చేశారు. కేవలం ఐదు శాతం మంది మగాళ్లు మాత్రమే తమ భార్యలతో కలిసి బయటకు వెళుతున్నారన్న ఆయన, 90 శాతం మంది పురుషులంతా, ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నవారేనని వ్యాఖ్యానించారు. అయినా, పరస్పర అంగీకారం ఉంటే ఇలాంటి విషయాలు ఎంతమాత్రం తప్పుకాదని కూడా ఆయన ఓ న్యాయమూర్తిలా తీర్పు ఇచ్చారు. బ్లాక్ మార్కెటింగ్ విషయంలో పేదలకు తక్కువ శిక్ష సరిపోతుందన్న మాంఝీ, ధనవంతులకు మాత్రం భారీ శిక్షలు అమలు చేయాలన్నారు.

  • Loading...

More Telugu News