: కార్యాలయంలోనే ఉరేసుకున్న జిల్లా సంక్షేమ శాఖాధికారి... ఒడిశాలోని రాయగఢ్ లో ఘటన
మొన్నిటికి మొన్న అనంతపురం జిల్లాలో ఓ జిల్లా స్థాయి అధికారి తన కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ దుర్ఘటనను మరువక ముందే ఇదే తరహాలో ఒడిశాలోనూ మరో ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా సంక్షేమ శాఖాధికారి దానేశ్వర పృష్ఠి తన కార్యాలయంలోనే ఉరేసుకుని తనువు చాలించాడు. నేటి మధ్యాహ్నం వెలుగు చూసిన ఈ ఘటన ఒడిశాలో కలకలం రేపుతోంది. దానేశ్వర పృష్ఠి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.