: ఢిల్లీ కాంట్రాక్టు ఉద్యోగులకు కేజ్రీవాల్ శివరాత్రి బొనాంజా... ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ
సామాన్యుడిగా ఎన్నికల బరిలోకి దిగి అఖండ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుల అంచనాలకనుగుణంగానే పనిచేసుకుపోతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆయన మహాశివరాత్రి పర్వదినాన కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రతను ప్రసాదించారు. కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ప్రకటనతో సరిపెట్టని ఆయన కొద్దిసేపటి క్రితం తన ప్రభుత్వం చేత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించారు.