: విద్యార్థులకు ప్రేమ పాఠాలు బోధిస్తున్న తెలుగు టీచరమ్మ!


ఇటీవల ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ప్రేమ పాఠాలు బోధిస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమేనంటున్నారు పోలీసులు. వివరాల్లోకెళితే... సింగరాయకొండలోని గురుకుల పాఠశాలలో వాలెంటైన్స్ డే నాడు ఉష అనే తెలుగు టీచర్ విద్యార్థులకు ప్రేమను గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది. ప్రేమ, దాని పుట్టుపూర్వోత్తరాలు, పర్యవసానాలు... ఇత్యాది విషయాలను విపులంగా చెప్పిందట సదరు పంతులమ్మ. దీనిపై ప్రశ్నించిన ప్రిన్సిపాల్ పైనే కేసు పెట్టింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి విచారించగా, ఉష నిర్వాకం వెల్లడైంది. ఆమె తప్పుడు కేసు పెట్టిందని, ప్రేమ పాఠాలు బోధించడం నిజమేనని తేల్చారు.

  • Loading...

More Telugu News