: వెంకయ్యనాయుడా... ఆయన జోకర్ కు ఎక్కువ, బఫూన్ కు తక్కువ!: హర్షకుమార్


మాజీ ఎంపీ హర్షకుమార్ చాన్నాళ్లకు మీడియా ముందుకువచ్చారు. కాకినాడలో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేశారు. ఆయన జోకర్ కు ఎక్కువని, బఫూన్ కు తక్కువని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడంలో బీజేపీ, కాంగ్రెస్ లది సమానపాత్ర అని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై పోరాడితేనే కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని అన్నారు. పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయడం ద్వారా హామీల అమలుకు పాటుపడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఇక, సీఎం చంద్రబాబుపైనా ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి పర్యాయం రైతులకు అన్యాయమే జరుగుతోందని, రాష్ట్రంలో రైతులకు ప్రధాన శత్రువు చంద్రబాబే అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News