: కోటప్పకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ కోడెల


ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహాశివరాత్రి పురస్కరించుకుని గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కాకతీయ సేవాసమితి ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కోడెలతో పాటు మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యుడు ఆంజనేయులు హాజరయ్యారు. కాగా, కోటప్పకొండ క్షేత్రానికి పొరుగు జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ భక్తులు ప్రత్యేక బస్సుల్లోనే కొండపైకి వెళ్లాలని కోడెల సూచించారు.

  • Loading...

More Telugu News