: ప్రజలకు ప్రధాని మోదీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాన అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శైవక్షేత్రాలన్నీ భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. భక్తులు శివనామ స్మరణ చేస్తూ భక్తిపారవశ్యంలో తేలిపోతున్నారు. భక్తులు శివుని దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరి ఉన్నారు.