: 'సరైన సమయంలో సరైన నిర్ణయం' అంటోన్న రాజనర్సింహ
రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ ముగిసింది. వీరిద్దరి మధ్య అరగంట పాటు చర్చలు జరిగాయి. రాజధాని ఢిల్లీలో నిన్న రాహుల్ తో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సమావేశమైన అనంతరం నేడు రాజనర్సింహ.. ఆజాద్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. కళంకిత మంత్రుల పూర్తి సమాచారం అధిష్ఠానం వద్ద ఉందని, వారిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇంకా తమ భేటీలో రాష్ట్ర వ్యవహారాలతో పాటు, 2014 ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చిందని రాజనర్సింహ వెల్లడించారు.