: అమెరికాలో వైన్ షాపు నిర్వహిస్తున్న ఎన్నారై కాల్చివేత


అమెరికాలోని న్యూజెర్సీలో వైన్ షాపు నిర్వహిస్తున్న అమిత్ పటేల్ (28) పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఆదివారం పటేల్ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు షాపు వద్దకు వచ్చారు. అక్కడ రక్తమోడుతున్న స్థితిలో పటేల్ కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు సోమవారం మరణించాడు. దోపిడీకి పాల్పడేందుకు వచ్చిన వ్యక్తులే కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News