: కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మోదీ
నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 61వ జన్మదినం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ ఈ మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో భేటీ అవుతారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మించబోయే ప్రాజెక్టులపై చర్చిస్తారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.