: చిత్తూరు జిల్లాను వీడని గజరాజులు
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో గజరాజులు పంటపొలాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ప్రవేశించి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. తాజాగా, రామకుప్పం మండలంలో రెచ్చిపోయాయి. రామాపురం, నారాయణపురం, భీమాకురుపల్లి, కానాపురం, పెద్దూరు, నన్యాల ప్రాంతాల్లో ఏనుగులు పొలాలు, తోటలను ధ్వంసం చేశాయి. వరి పొలాలను, అరటి తోటలను నాశనం చేశాయి. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.