: శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు


మహాశివరాత్రి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునుంచే ముక్కంటిని దర్శించేందుకు పోటీలుపడ్డారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, మణికేశ్వరం, పొదిలిలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివ దర్శనం కోసం బారులు తీరారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం, సామర్లకోట, కోటిపల్లి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయాల్లో రద్దీ ఎక్కువైంది. అటు, తెలంగాణ రాష్ట్రంలోనూ మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మంచిర్యాల, వేలాల మల్లన్న, కాగజ్ నగర్ ఈజ్గాం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట, చెర్వుగట్టు, మఠంపల్లి, మేళ్లచెర్వు ఆలయాల్లో భక్తులు శివపూజలు చేసి తరించిపోయారు.

  • Loading...

More Telugu News