: శ్రీశైలంలో నిండిపోయిన క్యూ లైన్లు


మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో, ఈ ఉదయానికి క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. పాతాళగంగలో స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సాయంత్రం స్వామివారిని నందివాహనంపై ఊరేగించనున్నారు. ఇక, విజయవాడ పాత శివాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గాఘాట్ వద్ద స్నానానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News