: భక్తులతో కిటకిటలాడుతున్న పంచారామ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్ లో పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచిన అమరావతి అమరేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామి, సామర్లకోట కాలభైరవస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అటు, తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.