: శైవ క్షేత్రాల్లో భక్తుల కోలాహలం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. పరమేశ్వరుడిని దర్శించుకుని తరించేందుకు తరలివస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి,అమరావతి పుణ్యక్షేత్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర శైవ క్షేత్రాలలోనూ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.