: ఈ అవార్డులు ప్రతి ఏడాది ప్రకటిస్తారు... తీసుకోవడానికి మాత్రం ఎవరూ రారు!
అవార్డులంటే ఎవరికైనా సంతోషాన్నిచ్చేవే. కష్టానికి, ప్రతిభకు గుర్తింపు ఆ అవార్డుల రూపంలో దక్కుతుంది. అయితే, అవార్డుల్లో కొన్ని చెత్త అవార్డులు కూడా ఉంటాయి. హాలీవుడ్ అందాలతార నికోల్ కిడ్మన్ ఓ అవాంఛనీయ అవార్డుకు ఎంపికైంది. ఆ అవార్డు పేరు 'బార్ఫ్టా అత్యంత చెత్త నటి' పురస్కారం. తాజాగా ఈ అవార్డుకు కిడ్మన్ ను ఎంపిక చేశారు నిర్వాహకులు. అన్నట్టు బార్ఫ్టా అంటే... 'బ్రిటీష్ అకాడమీ ఫర్ రబ్బిష్ ఫిలింస్ అండ్ టెర్రిబుల్ యాక్టింగ్' అన్నమాట. కాగా, 'గ్రేస్ ఆఫ్ మొనాకో' చిత్రంలో కనబరిచిన నటనను అసహ్యించుకుంటూ కిడ్మన్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇక, అత్యంత చెత్త బ్రిటీష్ సినిమాగా 'పుడ్సీ ద డాగ్: ద మూవీ' ఎంపికైంది. అత్యంత చెత్త నటుడిగా సైమన్ పెగ్ నిలిచాడు. 'హెక్టర్ అండ్ సెర్చ్ ఫర్ ద హ్యాపీనెస్' సినిమాలో నటనకుగాను పెగ్ కు ఈ పురస్కారం దక్కింది. అన్నట్టు... ఈ అవార్డులను నిర్వాహకులు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఈ 'చెత్త' అవార్డులను అందుకోవడానికి మాత్రం ఎవరూ రారు.