: లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే, ఆ ప్రశ్నకు ఆయన తప్ప మరెవ్వరూ కరెక్టుగా జవాబు చెప్పలేరేమో! కానీ, విజయవాడలో లగడపాటి రాజకీయాల్లోకి రావాలంటూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మద్దతుదారులు బ్యానర్లు, ఫ్లెక్సీలతో అభిమానాన్ని ప్రదర్శించారు. రాజకీయాల్లోకి మీవంటి నీతిపరులు రావాలంటూ వాటిలో పేర్కొన్నారు. దీంతో, లగడపాటి పునరాగమనంపై ఊహాగానాలు బయల్దేరాయి. రాష్ట్రాన్ని విడదీస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన లగడపాటి అన్నట్టుగానే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వ్యాపారాలపై దృష్టిపెట్టారు.