: చంద్రబాబు ఇక్కడే పులి... ఆయన ముందు పిల్లే!: రఘువీరా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రధాని మోదీ అంటే భయపడుతున్నారని అన్నారు. బాబు రాష్ట్రంలోనే పులి అని, ఢిల్లీ వెళితే మోదీ ముందు పిల్లేనని ఎద్దేవా చేశారు. ప్రధాని అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ సందర్భంగా ఒంగోలులో ఆయన మాట్లాడారు. ఏపీకి అందాల్సిన నిధులు తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 23న ఢిల్లీలో ఆందోళన చేపడతామని తెలిపారు. సొంత రాష్ట్రానికి వేల కోట్లు కేటాయిస్తున్న ప్రధాని మోదీ ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారని రఘువీరా ఆరోపించారు. సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీసేందుకు వెనకాడుతున్నారని మండిపడ్డారు.