: రేపు విశాఖ బీచ్ లో కోటి లింగార్చన... హాజరవనున్న చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మీ
మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖపట్నం బీచ్ లో కోటి లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందం, మాజీ ఎంపీ జయప్రద, మాజీ ఎమ్మెల్యే జయసుధ హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కళలన్నా, కళాకారులన్న ఆదరణ కనబరిచే సుబ్బరామిరెడ్డి ప్రతి ఏడాది సీనియర్ సినీ తారలను సత్కరిస్తుండడం తెలిసిందే.