: ప్రమాదం నుంచి తప్పించుకున్న మంత్రి నారాయణ
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మంత్రి నారాయణకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ చెక్ పోస్టు వద్ద చోటు చేసుకుంది. కాగా, కారు డ్రైవరు వెంకటేశ్వర్లు గాయపడ్డాడు. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.