: అక్కినేని అఖిల్ పేరుతో సోషల్ మీడియాలో వంచన... యువకుడికి దేహశుద్ధి చేసిన యువతి


టాలీవుడ్ హీరో నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి సినిమా ఇంకా రాకముందే ఆ యువ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ విశేషంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో, అభినవ్ అనే యువకుడు సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ పేరిట మోసాలకు తెరదీశాడు. నిజంగానే అఖిల్ అని భావించిన అమ్మాయిలు ఆ వంచకుడి ఫేస్ బుక్ అకౌంట్ కు ఆకర్షితులయ్యారు. ఇలా, అమ్మాయిలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న ఆ యువకుడి గుట్టును ఓ యువతి రట్టు చేసింది. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి హైదరాబాదు కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించింది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News