: ఈ రోజు ఢిల్లీ సెక్రటేరియట్ లో మీడియాకు నో ఎంట్రీ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్... ఈ రోజు తొలిసారిగా సచివాలయంలో విధులకు హాజరయ్యారు. ఈ సన్నివేశాన్ని కవర్ చేయాలనుకున్న మీడియా ప్రతినిధులకు నిరాశే మిగిలింది. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు తొలి రోజున సెక్రటేరియట్ లోకి మీడియాను భద్రతా సిబ్బంది పంపించలేదు. ఎందుకు పంపించడం లేదన్న కారణం చెప్పడానికి... అధికారులు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే, సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని సమాచారం.