: గ్యాంగ్ స్టర్ అబూసలేంను దోషిగా తేల్చిన టాడా కోర్టు


ముంబైకి చెందిన బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అబూసలేంను టాడా కోర్టు దోషిగా తేల్చింది. 1995లో ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న జైన్ బంగ్లా బయట ఆయన్ను కాల్చి చంపారు. తాను కోరిన భారీ మొత్తాన్ని ఇవ్వడానికి జైన్ నిరాకరించడంతో... అబూసలేం ఈ హత్య చేయించాడని పోలీసులు ఆరోపించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కూడా సలేం నిందితుడిగా ఉన్నాడు. అయితే, దోషిగా తేలిన సలేంకు ఎలాంటి శిక్ష విధించాలనే దానిపై రేపు వాదనలు జరగనున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అబూసలేం దేశాన్ని వదిలి పోర్చుగల్ కు మకాం మార్చాడు. అతడిని 2005లో భారత్ కు తీసుకు వచ్చారు. అప్పటి నుంచి అతను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే ఉంటున్నాడు. 2005లో సలేంను ఇండియాకు తీసుకు వచ్చిన తర్వాత, కోర్టుల్లో పలు విచారణలు జరిగాయి. అయితే, పోర్చుగల్ నుంచి తీసుకువచ్చిన తర్వాత అబూసలేంను దోషిగా నిర్ధారిస్తూ వెలువడిన తొలి తీర్పు మాత్రం ఇదే.

  • Loading...

More Telugu News