: నిద్రపోతుంటే లేపి విషయం చెప్పారు... చాలా ఆనందంగా ఉంది: యువరాజ్ సింగ్
బెంగళూరులో ఐపీఎల్ 8వ సీజన్ ఆటగాళ్ల వేలం జరుగుతున్న సమయంలో తాను నిద్రపోతున్నానని, మిత్రులు కొంతమంది ఇంటికి వచ్చి అభినందించడంతో విషయం తెలిసిందని క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. ఐపీఎల్ 8 వేలంలో యువరాజ్ ను రూ.16 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గ్యారీ కిర్ స్టన్ కోచింగ్ లో మరోసారి ఆడబోతుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు. గతంలో ఆయన శిక్షణలో మంచి విజయాలు సాధించానని గుర్తు చేసుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తోనూ అవి పునరావృతమవుతాయని ఆశిస్తున్నట్టు యువరాజ్ పేర్కొన్నాడు.