: రూ.1244 కోట్లతో 'పనయా'ను విలీనం చేసుకోనున్న ఇన్ఫోసిస్


మిగులు నిధులు పుష్కలంగా ఉన్న ఇన్ఫోసిస్ మరో భారీ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీ సేవలందిస్తున్న 'పనయా' సంస్థను విలీనం చేసుకోనుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య డెఫినెట్ అగ్రిమెంట్ కుదిరిందని, మొత్తం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,244 కోట్లు) వెచ్చించనున్నామని, మొత్తం నగదు రూపంలో చెల్లిస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కాలిఫోర్నియా కేంద్రంగా, 2006లో ప్రారంభమైన పనయా... సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఆటోమేషన్ టెక్నాలజీ సేవలు అందిస్తోంది. రేపటి తరం సాంకేతిక సంస్థలను కొనుగోలు చేసేందుకు తాము కృషి చేస్తున్నట్టు గత సంవత్సరం ఆగష్టులో ఇన్ఫీ సీఈఓ విశాల సిక్కా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యూహంలో భాగంగానే పనయాను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News