: పవార్ తో నెలలో రెండు సార్లయినా మాట్లాడతానన్న మోదీ... మహారాష్ట్రలో కొత్త ‘పొత్తు’లపై చర్చ


మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీజేపీతో ఎన్సీపీ పొత్తుకు బీజం పడిపోయిందని, ప్రకటన విడుదల కావడమే తరువాయి అన్న రీతిలో ప్రచారం సాగుతోంది. దీనికంతటికీ కారణం ప్రధాని నరేంద్ర మోదీ నిన్న బారామతిలో చేసిన వ్యాఖ్యలేనట. పవార్ కూతురు సుప్రియా సూలే ప్రాతినిథ్యం వహిస్తున్న బారామతి నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ, ‘‘నెలలో కనీసం రెండు సార్లయినా శరద్ పవార్ తో మాట్లాడుతుంటాను. పవార్ ఎప్పుడూ రైతుల దురవస్థ గురించే ఆలోచిస్తుంటారు’’ అని అన్నారు. గడచిన ఎన్నికల సందర్భంగా పవార్ తో పాటు ఆయన పార్టీపైనా విమర్శనాస్త్రాలు సంధించిన మోదీ, ఎనిమిది నెలలు తిరక్కముందే పవార్ ను కీర్తిస్తూ మాట్లాడటంతోనే కొత్త రాజకీయ పొత్తులపై చర్చకు తెరలేచిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News