: భారత్ గెలుస్తుందని ముందే చెప్పిన పాక్ ముస్లిం లీగ్ యువకుడు... ఫిక్సింగా?


దాయాదుల మధ్య నిన్న జరిగిన క్రికెట్ పోరులో పాకిస్థాన్ ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతుండగానే, పాకిస్థాన్ ముస్లిం లీగ్ యూత్ వింగ్ లో పనిచేస్తున్న అస్లాం ఖాన్ తనోలి అనే యువకుడు ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఫలితాన్ని, ఏ జట్టు ఎంత స్కోర్ చేస్తుందో కూడా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. భారత్ సరిగ్గా 300 పరుగులు, పాకిస్తాన్ 220 పరుగులు చేస్తుందని, మ్యాచ్ చివర్లో ఐదు ఫోర్లు వస్తాయని, ఈ అంకెల్లో ఎలాంటి తేడా రాదని ఛాలెంజ్ చేస్తున్నట్టు తెలిపాడు. అతను ట్వీట్ చేసిన అంకెలకు చాలా దగ్గరగా స్కోర్లు ఉండటం అభిమానుల్లో పలు ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది. అస్లాం ఖాన్ అంత కచ్చితంగా ఎలా చెప్పాడనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలను కొందరు అభిమానులు లేవనెత్తినా, చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టు ఫాన్స్ వేడుకల మూడ్ ఇంకా తగ్గలేదు.

  • Loading...

More Telugu News