: మురళీ విజయ్ ఖరీదు రూ.3 కోట్లు... కొనుక్కున్న పంజాబ్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ సీజన్ ఆటగాళ్ల వేలం ఈ ఉదయం బెంగళూరులో ప్రారంభం అయింది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ నేతృత్వంలో వేలం జరుగుతుండగా, క్రికెటర్ మురళీ విజయ్ ని పంజాబ్ ఫ్రాంచైజీ రూ.3 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ రూ.7.5 కోట్ల ధర పలికారు. కాగా, జయవర్ధనే, చెన్నై జట్టు రిలీజ్ చేసిన డేవిడ్ హస్సీ, జాన్ హస్టింగ్స్, బెన్ హిల్ఫెన్ హాస్, విజయ్ శంకర్ తదితరులను ఏ ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటాయో మరి కాసేపట్లో తేలుతుంది.

  • Loading...

More Telugu News