: మీరు తలచుకుంటే జగన్ బాబు సీఎం అవుతాడు: కార్యకర్తలతో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
వైసీపీ తెలంగాణ శాఖ కార్యాలయాన్ని నిన్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రారంభించారు. లోటస్ పాండ్ లోని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిలో ఏర్పాటైన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే తెలంగాణ శాఖకు కాస్త చోటిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యాలయాన్ని నిన్న విజయమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ‘‘అసాధ్యమంటూ ఏదీ లేదని అరవింద్ కేజ్రీవాల్ నిరూపించారు. మీరు తలచుకుంటే జగన్ బాబు సీఎం అవుతాడు’’ అన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలవి మాటలే తప్ప చేతల్లేవని ఆమె ఆరోపించారు.