: ఇరగదీస్తాడు అనుకుంటే... ఇంత జిడ్డా!
క్రికెట్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే కొద్దిమందిలో క్రిస్ గేల్ ఒకడు. అతడు బాదుతుంటే మైదానంలో ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లు కూడా కళ్ళప్పగించి చూడాల్సిందే. అటువంటి క్రిస్ గేల్ ఇవాళ జిడ్డు ఆట ఆడి చూపాడు. పసికూన ఐర్లాండ్ బౌలర్ల ధాటికి వెనుకంజ వేశాడు. న్యూజిలాండ్ లోని నెల్సన్ లో జరుగుతున్న మ్యాచ్ లో గేల్ నిరాశపరిచాడు. ఓపెనర్ గా వచ్చి 65 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులు చేశాడు. తన ఆటతీరుకు భిన్నంగా ఆడి 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో సరిపెట్టుకున్నాడు. మైదానం బయటికి బంతులను పంపే గేల్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం అభిమానులను నిరాశపరిచింది. కాగా, ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ముందు వెస్టిండీస్ 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతానికి దీటుగా జవాబిస్తున్న ఐర్లాండ్ 26 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది.