: ఆ యువ నటిది ఆత్మహత్యే!
బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మిది ఆత్మహత్యేనని మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్ ఫతేనగర్ లోని ఠాకూర్ ఆర్‌డీ కాంప్లెక్స్ లోని తన ప్లాట్‌లో దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఉరివేసుకొని చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీప్తి చనిపోయే ముందు వరకు లాప్ టాప్ ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. దానికి పాస్ వర్డ్ ఉండటంతో ఇంకా ఓపెన్ చేయలేకపోయారు. లాప్ టాప్ తెరిస్తే, దీప్తికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడవుతాయని, ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.