: ఆరెస్సెస్ వ్యూహంలో కేజ్రీవాల్ ఓ భాగం: కాంగ్రెస్ పరాజయంపై డిగ్గీ రాజా కొత్త భాష్యం


ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కొత్త భాష్యం చెప్పారు. ‘కాంగ్రెస్ రహిత భారత్’ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రచించిన వ్యూహంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భాగస్వామి అయ్యారని ఆయన ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నిర్మూలన కోసం ఆరెస్సెస్ రచించిన పకడ్బందీ ప్రణాళికలో కేజ్రీవాల్ కూడా ఓ భాగమే. ఈ వ్యాఖ్యలు చేస్తున్న నాపై ఆరెస్సెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తిట్ల వర్షం కురిపించినా, ఇదే నిజం. అవినీతికి వ్యతిరేకంగా గతంలో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం వెనుక కూడా ఆరెస్సెస్ హస్తముందని నాడు నేను చేసిన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ నమ్మలేదు. నాకు పిచ్చి పట్టిందని కూడా నాడు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు నా ఆరోపణల్లోని సత్యం రుజువైంది’’ అని డిగ్గీ రాజా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News