: ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ


ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు, రాజధాని నిర్మాణం వంటి అంశాలను ఆయన ప్రధానితో చర్చించినట్టు సమాచారం. అంతకుముందు బాబు, పునరుత్పాదక రంగ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని సోలార్ హబ్ గా తయారుచేస్తామని ఉద్ఘాటించారు. ఏపీ సోలార్, పవన విద్యుత్ విధానాల వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించారు. అటు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలో బిజీగా ఉన్నారు. రెండ్రోజుల పర్యటన కోసం హస్తిన వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. కేసీఆర్ వెంట కవిత, వినోద్, కేకే తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News