: మోదీ హవా ఏమాత్రం తగ్గలేదంటున్న 'చిన్నమ్మ'
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి నెల్లూరు జిల్లా కోవూరులో బీజేపీ క్రియాశీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా తగ్గుతోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని ఉద్ఘాటించారు. అందుకు, ఇటీవల జరిగిన ఒడిశా మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు నమోదు చేసిందని, అందుకు ప్రధాని మోదీ హవానే కారణమని తెలిపారు.