: మనవాళ్లు 'టెంపర్' చూపించారు: లిరిక్ రైటర్ భాస్కరభట్ల
పాకిస్థాన్ పై ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో టీమిండియా నెగ్గడంపై సెలబ్రిటీలు స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ ధోనీ సేన విక్టరీపై హర్షం వ్యక్తం చేశారు. కీలక మ్యాచ్ లో మనవాళ్లు 'టెంపర్' చూపించారని కొనియాడారు. ఇక, అగ్రశ్రేణి నటుడు ప్రకాశ్ రాజ్ కూడా టీమిండియాకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఫిబ్రవరి 15 చారిత్రాత్మకమైన రోజని, 46 ఏళ్ల క్రితం ఇదే రోజున తాను తొలి చిత్రానికి సంతకం చేశానని, ఇప్పుడదే రోజున భారత జట్టు పాక్ పై విజయం సాధించిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్... టీమిండియాకు సరైన ఆరంభం లభించిందని ట్వీట్ చేశారు.