: 'డి' గ్యాంగ్ కు చెందిన 'బ్లాక్ స్కార్పియన్' అరెస్ట్
అండర్ వరల్డ్ డాన్, ముంబయి వరుస పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం అనుచరుడు శ్యాం కిశోర్ (50) అలియాస్ బ్లాక్ స్కార్పియన్ ను అరెస్టు చేశారు. గోవాలోని పనాజీకి సమీపంలోని శాలిగో టౌన్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. శ్యాం కిశోర్ షార్ప్ షూటర్ గా పేరు గాంచాడు. 1993 ముంబయి పేలుళ్లకు సంబంధించి ఇతడు కూడా నిందితుల్లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ గత ఎనిమిదేళ్లుగా శాలిగోలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడని పోలీసులు తెలిపారు.