: వాళ్లు నిజంగా బాగా ఆడారు: పాక్ కెప్టెన్ మిస్బా
టీమిండియాతో అడిలైడ్ మ్యాచ్ లో ఓటమి అనంతరం పాకిస్థాన్ సారథి మిస్బా-ఉల్-హక్ మాట్లాడుతూ... భారత ఆటగాళ్లు నిజంగా బాగా ఆడారని కితాబిచ్చాడు. తొలుత భారీ స్కోరు సాధించి, ఆపై అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. లక్ష్యఛేదన సందర్భంగా, ఇన్నింగ్స్ మధ్యలో స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడం తమ అవకాశాలను ప్రభావితం చేసిందని మిస్బా అభిప్రాయపడ్డాడు. తమ బ్యాట్స్ మెన్ అందరూ రాణించి ఉంటే లక్ష్య సాధన సులువై ఉండేదని అన్నాడు. ఇక, ఈ పరాజయాన్ని మరచి, టోర్నీలో తర్వాతి మ్యాచ్ పై దృష్టిపెడతామని తెలిపాడు.