: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి స్పెషల్ అవార్డు


తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక అవార్డు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో సంప్రదాయేతర ఇంధన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి అంశంలో జగదీశ్ రెడ్డికి అవార్డు అందజేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణలో సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ చొరవను అభినందించారు.

  • Loading...

More Telugu News