: ఆఖర్లో కట్టుదిట్టం... పాక్ లక్ష్యం 301 పరుగులు


చివరి ఓవర్లలో భారత ఆటగాళ్లు మరిన్ని పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యారు. దీంతో, భారత స్కోర్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగులకు పరిమితం అయింది. ఇప్పుడిక పాకిస్తాన్ లక్ష్యం 301 పరుగులు. భారత ఆటగాళ్లలో కోహ్లీ 107, రైనా 74, ధావన్ 73 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పరుగులు రావడం కష్టమైంది. 48వ ఓవర్లో మూడో బంతికి రైనా (74), 49వ ఓవర్ ఆఖరి బంతికి జడేజా (3) అవుట్ అయ్యారు. ఆ తరువాత 50వ ఓవర్ తొలి బంతికి 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సొహైల్ ఖాన్ బౌలింగ్ లో మిస్బాకు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ ధోనీ అవుట్ కాగా, తరువాత బంతికి రహానే డక్ అవుట్ అయ్యాడు. దీంతో, ఒక దశలో 340 పరుగుల వరకూ వెళుతుందని భావించిన టీమిండియా స్కోరు, చివరికి 300 పరుగులుగా నమోదైంది.

  • Loading...

More Telugu News