: చెత్త బంతులు వేస్తుంటే... బౌండరీల మీద బౌండరీలు
పాకిస్తాన్ బౌలింగ్ లో పస లేకపోవడంతో భారత ఆటగాళ్ళు సులువుగా పరుగులు తీస్తున్నారు. సోహైల్ ఖాన్ వేసిన 44వ ఓవర్లో రైనా వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. దీంతో భారత స్కోర్ ఒక్కసారిగా పెరిగింది. అడిలైడ్ మైదానంలో ఫోర్ల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 44.2 ఓవర్లలో 263/2. కోహ్లీ 105 పరుగులతో, రైనా 65 పరుగులతో ఆడుతున్నారు. ఇప్పటివరకూ భారత ఆటగాళ్లు 21 ఫోర్లు, 4 సిక్స్ లు బాదారు.