: ప్రపంచం భారత యువత వైపు చూస్తోంది... ఢిల్లీలో మోదీ


నిరుపేద స్థాయి నుంచి ధనికుల వరకు అందరి పిల్లలు చదువుకోవాలని, ప్రపంచ దేశాలు భారత యువత వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రపంచ పునరుత్పాదక రంగ పెట్టుబడిదారుల సదస్సును ఈ ఉదయం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం ప్రసంగించారు. సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు, 45 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, "మన వద్ద శక్తి సామర్థ్యాలకు కొదవలేదు. అయితే వాటిని సద్వినియోగపరచుకోవడంలోనే వెనకున్నాం. మన కలలను మనమే సాకారం చేసుకోవాలి. వేగవంతమైన అభివృద్ధిని సాధించుకోవాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అన్నారు.

  • Loading...

More Telugu News