: మరో రికార్డు భాగస్వామ్యం... ఇరగదీసిన మిల్లర్, డుమిని... జింబాబ్వే విజయ లక్ష్యం 340 పరుగులు
ఆరంభంలో తడబడినా, జింబాబ్వేపై దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోర్ ను నమోదు చేసింది. 4 వికెట్ల పతనం తరువాత క్రీజ్ లోకి వచ్చిన మిల్లర్, డుమినిలు సెంచరీలతో ఇరగదీశారు. మిల్లర్ 92 బంతుల్లో 138, (7 ఫోర్లు, 9 సిక్స్ లు), డుమిని 100 బంతుల్లో 115 పరుగులు (9 ఫోర్లు, 3 సిక్స్ లు) చేసి నాట్ అవుట్ గా మిగలడంతో, 50 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా జట్టు 339 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 340 పరుగుల విజయ లక్ష్యంతో జింబాబ్వే కాసేపట్లో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. ప్రపంచ కప్ క్రికెట్ పోటీల చరిత్రలో 5వ వికెట్ కు వీరిద్దరూ చేసిన 256 పరుగుల స్కోరు అత్యధికం.