: అక్రమంగా బియ్యం దాచిన 'పందికొక్కులు'... రూ. 58 లక్షల విలువైన బియ్యం పట్టివేత
నెల్లూరు పట్టణంలోని స్టోనౌన్ పేటలోని రైస్ మిల్లుపై నేటి ఉదయం దాడి చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు మానవ రూపంలోని 'పందికొక్కులు' అక్రమంగా దాచిన వందలాది బియ్యం బస్తాలను కనుగొన్నారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.50 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో కావలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, ఎటువంటి అనుమతులు లేకుండా రెండు లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు లారీలను కూడా అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.