: జనగణమన... పులకించిన అడిలైడ్ స్టేడియం


భారత్, పాకిస్తాన్ల మధ్య చిరస్మరణీయమైన మరో పోరు ప్రారంభం అయింది. ఇరు జట్ల ఆటగాళ్ళు భారీ జెండాలు వెంటరాగా, అభిమానుల కోలాహలం మధ్య మైదానంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పాకిస్తాన్, ఇండియా జాతీయ గీతాలు ఆలపించారు. జనగణమన ఆలపించినప్పుడు గ్యాలరీలలోని భారత అభిమానులు గొంతు కలిపారు. ఈ మ్యాచ్ కి అమితాబ్ బచ్చన్ కామెంటరీ ఇస్తున్నారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు భారత ఇన్నింగ్స్ ప్రారంభించగా, తొలి ఓవర్ ను ఇర్ఫాన్ మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News